సాయిపల్లవి మంచి ఛాన్స్ కొట్టేసింది

175
Saipallavai got a good chance

సాయి పల్లవి, కాన్సెప్ట్ ఉన్న కథ లనే ఎన్నుకుని తనకంటూ మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకొని నటిగా కొనసాగుతుంది.

కోలీవుడ్ లో అయితే సూర్య‌, ధ‌నుష్ వంటి టాప్  కథానాయకులతో న‌టించి వ‌న్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ప‌ల్ల‌వి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించి మంచి న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది ఈ బ్యూటి.

అయితే తెలుగులో ఈ నటి ఇప్పటి వరకు నాని తప్ప స్టార్ హీరోల ప‌క్క‌న నటించలేదు. ఇపుడు ఏకంగా తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరో పక్కన జోడీగా న‌టించే అవకాశం కొట్టేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో వార్త చక్కర్లు కొడుతుంది.

మలయాళం లొ సూపర్ హీట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్‌లో సాయిప‌ల్ల‌వి నటిస్తున్నట్లు ఇప్ప‌టికే వార్త‌లు వస్తున్న విష‌యం తెలిసినదే.

తాజా టాక్ ప్ర‌కారం సాయిప‌ల్ల‌వి ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సతీమణి పాత్ర‌లో కనిపించనున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. మ‌రికొన్ని రోజులలో సాయిప‌ల్ల‌వి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనున్న‌ట్టు సమాచారం.

ఈ సినిమా లొ సాయిప‌ల్ల‌వి ది చిన్న పాత్రే అయినప్పటికి రెమ్మునరేష‌న్ మాత్రం ఎక్కువనే తీసుకుంటున్న‌ట్టు టాలీవుడ్ లో జోరుగా చర్చ న‌డుస్తోంది. మొత్తానికి అయితే సాయిప‌ల్ల‌వి టాలీవుడ్ లో కూడా టాప్ లిస్ట్‌లో ఉన్న హీరోతో న‌టించే అవ‌కాశం కొట్టేసింది.

ఇంకా రాబోయే కాలంలో మరిన్ని సినిమాలు పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కూడా క‌నిపించే ఛాన్స్ ఉంది.. ఈ సినిమాతో సాయి పల్లవి మరో మెట్టు ఎదిగి టాప్ హీరోయిన్ గా కొనసాగాలి అనీ కోరుకుందాం.