శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగ చైతన్య హీరో, సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న లవ్ స్టోరీ టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక విడుదల తేదీల మీద కాస్త అటు ఇటు అయినప్పటికీ లవ్ స్టోరీ, టక్ జగదీష్ ల విడుదల తేదీల కథ చివరికి సుఖాంతం అయ్యింది.
రెండు సినిమాల పెద్దలు కూర్చుని, కథానాయకుడు నాని సలహా, సూచనలతో ఈ వ్యవహారం కూల్ గా సెటిల్ చేసుకొని ఒక మాట మీదికి వచ్చారు. ఇక ఏప్రిల్ 16వ తేదిన లవ్ స్టోరీ, ఏప్రిల్ 23 వ తేదిన టక్ జగదీష్ విడుదలవుతున్నట్లు ప్రకటించారు.
అసలు విషయం ఏంటంటే ఆసియన్ సునీల్ నిర్మాత గా వ్యవరించిన చైతన్య-సాయిపల్లవిల లవ్ స్టోరీ ని ఏప్రిల్ 2న విడుదల చేద్దామ్ అనుకన్నారు. కానీ తరువాత కొన్ని కారణాల వలన 16 కు చేంజ్ చేశారు.
ఈ విడుదల తేదీలను చేంజ్ చేసేటప్పుడు, టక్ జగదీష్ సినిమాను అవుట్ రేట్ కు కొనుగోలు చేసిన, లక్ష్మణ్ తో మాట్లాడే చేసారు. కానీ అప్పటికే నాని-శివనిర్వాణ ల టక్ జగదీష్ కు ఏప్రిల్ 16 డేట్ ఫిక్స్ చేసి ఉంచారు.
సునీల్-లక్ష్మణ్ మాట్లాడుకున్న ఈ విషయం తెలియక సినిమా యూనిట్ ఒకే రోజు విడుదల అని టక్ జగదీష్ యూనిట్. ఇలాంటి నేపథ్యంలో ఇరు వర్గాలు నిన్న సమావేయ్యి. ఒక మాట మీదకు వచ్చినట్లు తెలిసింది.
పెద్ద పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ వున్న టైమ్ లో అనవసరపు గొడవలు లు వద్దని హీరో నాని స్వయంగా చెప్పారు. దాంతో 16న లవ్ స్టోరీ, 23న టక్ జగదీష్ విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఆ విధంగా ఈ విడుదల వ్యవహారం కంచికి చేరింది..