హాలీవుడ్ స్టైల్ లో ‘సాహో’ క్లైమాక్స్

247
saaho movie

ప్రభాస్‌ హీరోగా, సూజిత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది విడుదల అయ్యే సినిమాల్లో ఇదే బెస్ట్‌ చిత్రం కాబోతుందని కూడా ఈ చిత్రబృందం నమ్మకాన్ని వ్యక్తం చేస్తోందీ . అందులో భాగంగా ఈ చిత్రం క్లయిమాక్స్‌ కోసం ఏకంగా 100 మంది ఫైటర్లను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు దీని కోసమే భారీ ఎత్తున డబ్బులు ఖర్చుపెడుతున్నారట. రాజమౌళితో ప్రభాస్‌ చేసిన ‘బాహుబలి’ తర్వాత సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఈ ఆఖరి పోరాట సన్నివేశం కోసం అంతర్జాతీయ స్టట్‌మ్యాన్‌ కెన్నీ బేట్స్‌, ‘రెష్‌ అవర్‌ 3’ ఫేమ్‌ పెంగ్‌ జంగ్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం అబుదాబిలో చిత్రీకరిస్తున్నారు. గతంలో ఈచిత్ర దర్శకుడు సూజిత్‌ మాట్లాడుతూ ‘ ముందే చెప్పిన దాని కంటే షూటింగ్‌ ఇంకా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది.

క్లయిమాక్స్‌లో ఎనిమిది నిమిషాల భారీ పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తాం. ఇది అబుదాబిలో షూట్‌ చేస్తాం. దీని కోసం ప్రత్యేకంగా 10 ఎకరాల్లో సెట్‌ వేస్తున్నాం. సినిమాకే హైలైట్‌ అయిన ఈ పోరాట ఘట్టానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫైటర్లలో సుమారుగా 100మందిని ఉపయోగిస్తున్నాం. సుమారుగా రూ. 70కోట్లు ఖర్చు పెడుతున్నాం. హాలీవుడ్‌లో ప్రముఖ యాక్షన్‌ డైరెక్టర్‌ పెంగ్‌ జంగ్‌ ఆధ్వర్యంలో ఇది తెరకెక్కిస్తున్నాం’ అని తెలిపారు.