అంకుల్‌…వెడ్డింగ్ డ్యాన్స్ అదుర్స్..!

569
uncle-dancing like govinda-viral-video
image from below video

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఏదైనా హల్‌ చల్‌ చేస్తుందంటే చాలూ.. అది వార్తగా మారిపోతోంది. తాజాగా ఒక అంకుల్‌ డాన్స్‌ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. 40 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఒక వేడుకలో స్టేజీపై వేసిన స్టెప్పులకు ఇప్పుడు అంతా ముగ్ధులైపోతున్నారు. జితేంద్ర, శతృఘ్నసిన్హా, గోవిందా కాంబోలో వచ్చిన ఖుద్‌గర్జ్‌(1987) చిత్రంలోని ‘ఆప్‌ కే ఆ జానే సే…’ పాటకు ఆ వ్యక్తి డాన్స్‌ చేశాడు. అచ్చం గోవిందాను ఇమిటేట్‌ చేస్తూ అతను చేసిన డాన్సింగ్‌ మూమెంట్స్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి. మ్యాజిక్‌ స్టెప్పులకు పేరున్న గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ ఆ అంకుల్‌పై అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ వీడియోను సర్క్యూలేట్‌ చేస్తున్నారు. మీరూ చూడండి.



అంకుల్‌…వెడ్డింగ్ డ్యాన్స్ part-1



అంకుల్‌…వెడ్డింగ్ డ్యాన్స్ part-2