మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా 5 లీటర్ల పెట్రోల్

247

ఒక‌ప్పుడు ఉల్లిగ‌డ్డ‌ల రేట్లు పెరిగిన‌ప్పుడు పళ్లిల్ల‌ల్లో వాటిని గిఫ్ట్‌గా ఇచ్చారు. కొంత మంది అడిగి మ‌రీ తీసుకున్నారు.

ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మండుతున్న స‌మ‌యంలో అద్భుత ప్ర‌తిభ‌కు వాటిని బ‌హుమానంగా ఇస్తున్నారు.

క్రికెట్ పోటీల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిస్తే నగదు బహుమతో..లేదా ఓ బైకో గిఫ్ట్‌గా ఇస్తారు. ఆ పోటీలు జరిగే స్థాయిని బట్టి బహుమతులు ఉంటాయి.

కానీ చ‌మురు ధ‌ర‌లో రోజుకో రకంగా పెరుగుతుండటంతో క్రికెట్ మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచిన ఓ క్రీడాకారుడికి 5 లీటర్ల పెట్రోల్ క్యాన్‌ను బహుమతిగా ఇచ్చారు.

ఇది నిరసన కోసం కావచ్చు లేదా పరిస్థితులను తెలియజేయటానికి కావచ్చు. ప్రస్తుతం పెట్రోల్, వంట గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి.

దేశమంత‌టా ఈ ధరల గురించే చర్చించుకుంటున్నారు. ఇలాగైతే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో భోపాల్‌లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కింద 5 లీటర్ల పెట్రోల్‌ను అవార్డుగా అందించారు.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రికెట్ టోర్నీ భోపాల్‌కు చెందిన‌ కాంగ్రెస్ నాయకుడు మనోజ్ సుక్లా ఆధ్వర్యంలో జరిగింది.

ఆదివారం (ఫిబ్రవరి 28,2021) జరిగిన ఫైనల్స్‌లో సలౌద్దీన్ అబ్బాసీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.

అతనికి 5 లీటర్ల్ పెట్రోల్‌ను అవార్డు కింద ఇచ్చారు.