
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
హైద్రాబాద్ నగరంలోని టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్‌ను పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భానును విడుదల చేయాలనేది తమ రిక్వెస్ట్ కాదని వార్నింగ్ అని సంజయ్ హెచ్చరించారు.
భాను అరెస్ట్ విషయంలో ఐజీ ప్రభాకర్‌కు సిగ్గుండాలని సంజయ్ వ్యాఖ్యానించారు.
లాలూ, కరుణానిధికి ఏం జరిగిందో కేసీఆర్ గుర్తుచేసుకోవాలని ఆయన హితవు పలికారు.
భానుప్రకాష్‌పై చేయి పడితే ఫామ్‌హౌస్‌పై చేయి వేయాల్సి వస్తుందని సంజయ్ హెచ్చరించారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని చెల్లించాలని యువ మోర్చా డిమాండ్ చేస్తోంది.
బీజేపీ కార్యాలయం నుంచి టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరిన యువ మోర్చా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.