గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క

240

కుక్క విశ్వాసానికి, న‌మ్మ‌క‌మైన కాప‌లాకు నిద‌ర్శ‌నం. కానీ ఓ కుక్క గుర‌క పెట్టి నిద్ర‌పోయింది.

అస‌లేం జరిగిందంటే.. లక్కీ అనే కుక్కను ఓ షాపు యజమాని తన బంగారు దుకాణానికి కాపలాగా పెట్టుకున్నాడు.

ఎవరైనా దొంగ వస్తే అరిచి భయపెడుతుందని ఆ యజమాని అనుకున్నాడు. అయితే అతడు అనుకున్న సీన్ రివర్స్ అయింది.

ఓ దొంగ వచ్చి షాపును దోచుకుంటుంటే అరవలేదు సరికదా గురక పెట్టి మరీ నిద్రపోయింది. షాపుతో తనకు సంబంధం లేనట్లుగా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది.

థాయ్‌ల్యాండ్‌లోని చియాంగ్ మాయ్ సిటీలోని ఓ బంగారు దుకాణంలో దోచుకునేందుకు బ్లాక్ టోపీ, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఓ దొంగ చొరబడ్డాడు.

యజమాని నుదిటికి గన్ గురి పెట్టి అతన్ని బెదిరించాడు. షాపులో ఉన్న బంగారు నగలను పట్టుకుని ఉడాయించాడు. ఇంత తతంగం జరిగినా కాపలాగా ఉన్న కుక్క మాత్రం ఇదేం పట్టనట్లు ప్రశాంతంగా గురకపెట్టి నిద్రపోయింది.

ఇక్క‌డే అసలు ట్విస్ట్ బయటపడింది. ఆ దొంగ తిరిగొచ్చి.. ఇదంతా ఫేక్ దొంగతనం అన్నాడు. షాపులో భద్రత ఎలా ఉందో పరీక్షించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్ అని స్పష్టం చేశాడు.

నిజంగా ఏదైనా దొంగతనం జరిగితే కుక్క మేల్కొంటుందా అని కూడా అత‌ను ప్రశ్నించాడు.

”మా కుక్క మనుషుల భావాలను అర్ధం చేసుకోగలదు. ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. ఏ చిన్న శబ్దం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతుంది.

సీసీటీవీ కెమెరాలలో నా హావభావాలను చూస్తే మీకే అర్ధమవుతుంది అని ఆ షాపు యజమాని అన్నాడు. అలాగే దొంగ వేషంలో వచ్చిన పోలీస్ ఆ కుక్కకు ముందే తెలుసట.

దీనితో విష‌యం అందరికీ అర్ధమైంది. అయితే దొంగతనం జరిగినప్పుడు మాత్రం కుక్క అలా గురకపెట్టి నిద్రపోవడం చాలామంది నెటిజన్లకు తీవ్ర అసహానాన్ని కలగజేసింది.