మోసగాళ్లు : మనీ స్కామ్ స్టోరీ అనగానే ఆ హీరోయిన్ భయపడింది… !

286
Dabbe Manadi Kummesko lyrical video from Mosagallu

24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ “మోసగాళ్లు”.

జెఫ్రే గీ చిన్ “మోసగాళ్లు” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.

నవీన్‌చంద్ర, రుహీసింగ్‌, నవదీప్, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

“మోసగాళ్లు” చిత్రంలో ఏసీపీ కుమార్‌ అనే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించనున్నారు.

ఇటీవలే చిరంజీవి రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంటోంది.

గత కొన్నేళ్లుగా కెరీర్‌లో సరైన హిట్ పడక సతమతమవుతున్న మంచు విష్ణు…

ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారు.

50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు.

చిత్రంలో మంచు విష్ణుకి చెల్లెలిగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్ర పోషించారు.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు విష్ణు.

ఈ సినిమాలో సిస్టర్ పాత్రకు మొదట ప్రీతీ జింటాను అనుకున్నామని,

కానీ అమెరికాకు సంబంధించిన మనీ స్కామ్ స్టోరీ అనగానే ఆమె కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో నటించలేను. ఇలాంటి సినిమా చేస్తే నన్ను కొడతారు. నా ఫ్యామిలీ మొత్తం యూఎస్‌లో ఉంటోందని ఆమె చెప్పారని విష్ణు పేర్కొన్నారు.

దీంతో కాజల్‌కు ఫోన్ చేయడంతో వెంటనే ఒప్పుకుందని ఆయన తెలిపారు.

రిస్క్ అని తెలిసినా కూడా మోసగాళ్ళు సినిమా నా మార్కెట్ పరిధిని బ్రేక్ చేయగలదనే నమ్మకం ఉందని విష్ణు తెలిపారు.