మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయి. దీంతో వాహనదారులు తమ వాహనాలను బయటికి తీసేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.
అంతేకాకుండా ప్రతి చిన్న పనికి బండిని బయటికి తీసే వారు ఇప్పుడు వాటిని వదిలేయడం కష్టంగా మారింది.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వాహనదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా రాలేదు.
అయితే ఇటీవల తిరుచ్చిలో కొత్తగా ఓపెన్ చేసిన బేకరీలో ఒక కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది.
ఈ విధానం ప్రకారం ఈ బేకరీలో ఒక కేజీ కేక్ కొంటే లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తారు.
ఈ బేకరీ ఓనర్ సాగైరాజ్ ఈ విధానం ద్వారా ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు. కొత్తగా తెరిచిన బేకరీ కాబట్టి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
సాగిరాజ్ ఈ ఆఫర్ గురించి మాట్లాడుతూ పెట్రోల్ ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ క్లిష్ట సమయంలో పెట్రోల్ ఉచితంగా ఇస్తే వినియోగదారులకు కొంతవరకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఈ ఆఫర్లు వినియోగదారులకు చాలా ప్రయోజనం చేకూర్చుతుంది. ఒక కిలో కేక్ కొనుగోలు చేసిన వారికి లీటర్ ఉచితంగా పెట్రోల్ ఇస్తామని తెలిపారు.
పెట్రోల్ మరియు డీజిల్ ఉచితంగా ఇవ్వడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో చాలా బేకరీలు ఈ విధమైన ఆఫర్లను ప్రకటించాయి.