నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (జూన్ 18)

289
today programs in hyderabad

ఆవిష్కరణలు
కార్యక్రమం: సాహితీకిరణం, త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో శ్రీ జన్నాభట్ల నటసింహప్రసాద్‌ రచించిన జన్నాభట్ల నటసింహప్రసాద్‌ కథలు-4 ఆవిష్కరణ. శ్రీ అయ్యదేవర పురుషోత్తమరావుకి అంకితం, జన్నాభట్ల నవలికలు-3 ఆవిష్కరణ..ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌కు అంకితం, మతసారమరస్యంపై కవిసమ్మేళనం
ముఖ్యఅతిథి: ఆచార్య కొలకలూరి ఇనాక్‌
సభాధ్యక్షుడు: గుదిబండ వెంకటరెడ్డి
ప్రారంభం: కళావీఎస్‌ జనార్దనమూర్తి
ఆత్మీయ అతిథి: డాక్టర్‌ గురజాడ శోభాపేరిందేవి
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక
సమయం: సాయంత్రం 6గం.

నృత్య నీరాజనం
కార్యక్రమం: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నృత్య కిన్నెర వార్షికోత్సవం, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డికి నృత్యనీరాజనం. హంస పురస్కార గ్రహీత డాక్టర్‌ మద్దాళి ఉషాగాయత్రి శిష్యులచే సంకీర్తనా కైంకర్యం కూచిపూడి నృత్య ప్రదర్శన
ముఖ్యఅతిథి: మాజీ గవర్నర్‌ రోశయ్య
సభాధ్యక్షుడు: డాక్టర్‌ పాలకుర్తి మధుసూదన్‌రావు
విశిష్ఠ అతిథి: మామిడి హరికృష్ణ



 

మానవ హారాలు
కార్యక్రమం: బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట 6 ఎకరాల భూమిలో, శిథిలావస్థలో ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌లో పేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ 4 ప్రాంతాల్లో మానవహారం
ముఖ్యఅతిథి: నల్లా సూర్య ప్రకాష్‌, చైర్మన్‌, బీఎల్‌ఎఫ్‌ తెలంగాణ రాష్ట్రం.
స్థలాలు: అలీకేఫ్‌ చౌరస్తా, శ్రీరమణ చౌరస్తా, ఛే నెంబర్‌ చౌరస్తా, తిలక్‌ నగర్‌ చౌరస్తా
సమయం: ఉదయం 11గం.

పుస్తకావిష్కరణ
కార్యక్రమం: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థ ఆధ్వర్యంలో ‘లెస్సన్స్‌ లెర్ట్న్‌’ పుస్తకావిష్కరణ
ముఖ్యఅతిథి: ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌,
ప్రత్యేక అతిథి: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.కె.జోషి,
గౌరవఅతిథి: రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం,
సభాధ్యక్షుడు: ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు
స్థలం: బేగంపేటలోని వివంతా తాజ్‌ హోటల్‌
సమయం: సాయంత్రం 6.30గం.