నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (జూన్ 02)

300
today programs in hyderabad

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు
కార్యక్రమం: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల బృందాల ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు
స్థలం: శిల్పారామం
సమయం: సా. 5.30 (4వ తేదీ వరకు)

శిలలపై చిరస్మరణీయులు
కార్యక్రమం: తెలంగాణ అవతరణ దినోత్స వాల్లో భాగంగా ప్రముఖ శిల్పి నివాస్‌ కొండేటి ‘శిలలపై చిరస్మరణీయులు’ శిల్ప చిత్రకళా ప్రదర్శన. తెలంగాణ వైతాళికులు కాళోజీ, దాశరథి, చాకలి ఐలమ్మ, గూడ అంజన్న, కత్తి కాంతారావు, నేరెళ్ల వేణుమాధవ్‌ వంటి ప్రముఖుల చిత్రాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి
స్థలం: ఐసీసీఆర్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రవీంద్రభారతి
సమయం: సా. 6 (5 వరకు)

టీవీ యాంకర్స్‌కు పురస్కారాలు
కార్యక్రమం: లలిత కళా స్రవంతి ఆధ్వ ర్యంలో టీవీ యాంకర్స్‌ ప్రతిభా పురస్కా రాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు
అతిథులు: పి.రఘువీర్‌(ఐఎఫ్‌ఎస్‌), జస్టిస్‌ జి.భవానీప్రసాద్‌, తదితరులు
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 5.30

సినీ సంగీత విభావరి
కార్యక్రమం: డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 73వ పుట్టినరోజు సందర్భంగా కళాసత్కార్‌ ఆధ్వర్యంలో ‘ఈ స్వరం – మన స్వరం’ సినీ సంగీత విభావరి
స్థలం: కళా సుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 5

హ్యాండీక్రాఫ్ట్స్‌ & హ్యాండ్లూమ్స్‌
కార్యక్రమం: గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్‌ ్క్ష హ్యాండ్లూమ్స్‌ ఎగ్జిబిషన్‌
స్థలం: గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్‌ ఎంపో రియం, రోడ్‌ నెం. 10, బంజారాహిల్స్‌
సమయం: ఉ. 11 – 9 (9వ తేదీ వరకు)

బబుల్‌ ఎకో ఫిల్మ్‌ ఫెస్టివల్‌
కార్యక్రమం: బబుల్‌ ఫిల్మ్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఫిల్మ్‌ ఫెస్టివల్‌
స్థలం: సారథీ స్టూడియోస్‌ ప్రివ్యూ థియేటర్‌
సమయం: ఉ. 10 (రేపటి వరకు)

బుల్లిపెట్టె బూచాడు
కార్యక్రమం: ఉదయభాను గరికిపాటి, బల్లెడ నారాయణమూర్తి రచించిన ‘బుల్లిపెట్టె బూచాడు’ ప్లే
స్థలం: అవర్‌ సేక్రెడ్‌ స్పేస్‌ ఆడిటోరియం, ఎస్డీ రోడ్‌, సికింద్రాబాద్‌
సమయం: సా. 7