కూతురిని వెతికి పెట్టిన వాట్సాప్

264
mother and daughter

జనగామ జిల్లా కేంద్రానికి చెందిన అక్షిత అనే విద్యార్థిని శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తల్లి నిర్మల మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా కూతురు కనిపించలేదు. కంగారు పడిన తల్లి.. అక్షితకు స్కూల్‌లో చదువు చెప్పిన అమ్మఒడి అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు జెల్లా దివ్యకు తెలిపింది. వెంటనే ఆమె భర్త జెల్లా శంకర్‌కు అక్షిత ఫొటో, వివరాలతోపాటు తప్పిపోయిన సమాచారాన్ని తెలిపింది.

ఆయన అమ్మఒడి అనాథ ఆశ్రమం వాట్సాప్‌ గ్రూప్‌లతోపాటు వివిధ గ్రూప్‌లలో పెట్టారు. దీంతో అక్షిత గుంటూరు జిల్లా కేంద్రం లో ఉందని, పోలీసులకు అప్పగించామని స్థానికులు.. ఆశ్రమ నిర్వాహకులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. బాలికలను పోలీసులు గుంటూరులోని సీడబ్ల్యూసీ కేంద్రానికి తరలించారు. శనివారం ఉదయం అక్షిత తల్లి నిర్మల, అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు గుంటూరుకు వెళ్లి బాలికను తీసుకువచ్చారు.