ప్రతిష్ఠాపన మహోత్సవం
కార్యక్రమం: హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జీర్ణోద్ధరణ ప్రయుక్త నూతన స్వర్ణ ఆలయ ప్రతిష్ఠ కుంభప్రోక్షణ మహోత్సవం.
( 22వరకు)
స్థలం: స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, ఎమ్మెల్యే కాలనీ,బంజారాహిల్స్
సమయం: 18న ఉదయం 7గం. నుంచి మధ్యాహ్నం 12వరకు మూర్తి కుంభ ఆవాహనం,పంచగన్య ప్రోక్షణ,ఆదివాసం, సాయంత్రం 5.30 నుంచి శాంతి హోమం.
ఆవిష్కరణలు
కార్యక్రమం: శ్రీ స్వామియే శరణం అయ్యప్ప మాసపత్రిక, డాక్టర్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకావిష్కరణ.
ముఖ్యఅతిథులు: ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఐడీ ఎస్పీ యూ రామ్మోహన్
స్థలం:బాగ్ అంబర్‌పేట డీడీకాలనీలోని అహోబిలమఠం కల్యాణ మండపం
సమయం: సాయంత్రం 6గం.
‘నివురు’ కవితా సంకలనం
కార్యక్రమం: సీనియర్ పాత్రికేయులు,కవి జి. శ్రీరామమూర్తి కవితా సంకలనం ‘నివురు’ ఆవిష్కరణ
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్
సమయం: ఉదయం 10.30గం.
సాంస్కృతిక కార్యక్రమం
కార్యక్రమం: శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం
స్థలం: రవీంద్రభారతి
సమయం: సాయంత్రం 6గం.
మధురగేయఝరి- వేటూరి
కార్యక్రమం: తేజస్విని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరిని సుందర రామ్మూర్తిని స్మరిస్తూ సినీగేయ రచయిత అనంత శ్రీరామ్‌కు వేటూరి పురస్కార ప్రదానం, గాయకుడు కళ్లేపల్లి మోహన్‌కు స్వరభూషణ బిరుదు ప్రదానం, వేటూరి గీతాల గాన లహరి
ముఖ్యఅతిథి: డాక్టర్ కె. లక్ష్మణ్ (బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు)
సభాధ్యక్షడు: డాక్టర్ పి. విజయబాబు
సభా ప్రారంభం: నందమూరి లక్ష్మీ పార్వతి
స్థలం: త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 5గం.
ప్రదర్శన
కార్యక్రమం: శిఖరం ఆర్ట్ థియేటర్స్-త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో ప్రముఖ నటి సౌందర్య వర్ధంతి సందర్భంగా ‘శ్రీ మంజునాథ ’ చిత్ర ప్రదర్శన.
స్థలం: కళావేంకట కళాదీక్షితులు కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 6గం.
పురస్కార ప్రదానం
కార్యక్రమం: సినారె-వంశీ విజ్ఞాన పీఠం-త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో ప్రముఖ సాహిత వేత్త ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యకి రాయప్రోలు-వంశీ సాహితీ పురస్కారం.
ముఖ్యఅతిథి: పీవీ మనోహరరావు(వ్యవస్థాపకుడు, స్వరార్థ సంక్షేమ సమితి)
స్థలం: కళాలలితకళావేదిక, త్యాగరాయగానసభ,
సమయం: సాయంత్రం 5గం
సమావేశాలు
కార్యక్రమం: ఇస్కాన్ కూకట్‌పల్లి ఆధ్వర్యంలో వార్షిక భగవద్గీత సమ్మర్ క్యాంపు గురించిన సమావేశం.
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్
సమయం: ఉదయం 11గం.
సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో
కార్యక్రమం: జస్టిస్ ఇన్ కథువా,ఉన్నావ్ కేసెస్,క్రైమ్ ఆన్ మల్టిఫుల్ కౌంట్స్, జస్టిస్ ఇన్ మక్కామసీద్ కేస్’ అంశంపై సమావేశం
సమయం: మధ్యాహ్నం 2గం
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్
ప్రారంభం
కార్యక్రమం: బీఎస్‌ఎన్‌ఎల్- మేధస్సు జీఎస్టీ సువిధాకేంద్ర ప్రారంభం
స్థలం: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ కేర్ సెంటర్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 11గం
వార్షికోత్సవం
కార్యక్రమం: తెలంగాణ సర్వోదయ మండలి ఆధ్వర్యంలో భూదాన్ ఉద్యమం వార్షికోత్సవం
స్థలం: బషీర్‌బాగ్‌ప్రెస్‌క్లబ్
సమయం: ఉదయం 11గం
సమ్మర్ క్యాంపు
కార్యక్రమం: కేంబ్రిడ్జ్ పబ్లిక్‌స్కూల్ ఆఽధ్వర్యంలో.. 3 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు పలు అంశాల్లో శిక్షణ
స్థలం: స్కూల్ ఆవరణలో.. (16 మే వరకు)
పెయింటింగ్ ఎగ్జిబిషన్స్
కార్యక్రమం: ‘అన్‌బౌండెడ్ స్పిరిట్’ శీర్షికన ప్రదీ్‌పకుమార్ చిత్రీకరించిన పెయింటింగ్స్ ప్రదర్శన
స్థలం: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నెం. 12, బంజారాహిల్స్
సమయం: ఉ. 11 – 7 (ఈ నెల 25 వరకు)
కార్యక్రమం: 30 మంది ఆర్టిస్టుల బృందం పెయింటింగ్స్ ప్రదర్శన
స్థలం: స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, మాదాపూర్
సమయం: ఉ. 11 – 7 (17 వరకు)
మోడలింగ్ వర్క్‌షాప్
కార్యక్రమం: జాయెస్ లైఫ్‌స్టైల్ ఆధ్వర్యంలో… ‘సమ్మర్ స్పెషల్ మోడలింగ్ వర్క్‌షాప్’
స్థలం: జాయెస్ లైఫ్‌స్టైల్, రోడ్ నెం. 13, బంజారాహిల్స్
సమయం: ఉ. 11 – 7 (ఈ నెల 22 వరకు)
పార్క్ ప్రారంభం
కార్యక్రమం: కులీకుత్‌బ్‌షా పార్క్ ప్రారంభం
ముఖ్యఅతిథులు: మంత్రి అజ్మీరా చందూలాల్, ఇన్మర్మేషన్ శాఖా మంత్రి తారక రామారావు
స్థలం: షేక్‌పేట సెవెన్ టూంబ్స్‌లోని ఆగాఖాన్ ఫేజ్- 1
సమయం:సాయంత్రం 5 గంటలకు