పిచ్చి పిచ్చి వేశాలా ? మండి పడ్డ జీవిత

633
jeevitha fire on sandhya comments

శ్రీరెడ్డి వ్యవహారంపై జీవితారాజశేఖర్ స్పందించారు. అమ్మాయిలను తన భర్త దగ్గరకు పంపించిందన్న మహిళా హక్కుల కార్యకర్త సంధ్య ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. ఆమెలాగే చాలా మంది మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే అభిమానులు కౌంటర్ ఇచ్చారని, జీవితా రాజశేఖర్ మీద మాట్లాడితే ఎవరూ లేరని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ‘పిచ్చి పిచ్చి వేషాలేస్తే చూస్తూ గాజులు తొడుక్కొని ఎవరిక్కడ కూర్చోలేదు.. ‘సంధ్యాగారు’’ అని ఆమె మండిపడ్డారు. ‘‘మీ సంస్కారం గురించి మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. మీ చరిత్రేంటో.. మీ కథేంటో నాకు బాగా తెలుసు. అయినా కూడా నేను బయటపెట్టదలచుకోలేదు’’ అని జీవితా రాజశేఖర్ మండిపడ్డారు. తన గురించి ఏం తెలుసని మాట్లాడారని ప్రశ్నించారు. ఆ మాటలు మాట్లాడిన సంధ్య, ఆ డిబేట్‌ను నడిపిన ఆ చానెల్‌ బాధ్యత వహించాల్సిందేనన్నారు. వాళ్లు సమాధానం చెప్పే వరకూ ఊరుకోనన్నారు.



అసలు దీనికంతటికీ కారణం శ్రీరెడ్డి అని ఆమె అన్నారు. ‘‘అసలు ఆమెకు ఏం కావాలి? ఆమెకు ఇండస్ట్రీ ఏం ఇవ్వలేదు? ఆమె ఏం అడిగింది? ఇంత వరకూ నాకైతే స్పష్టత లేదు. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం ఇస్తున్న మీడియానే అడుగుదామని ఇలా ప్రెస్ మీట్ పెట్టాను’’ అని ఆమె అన్నారు. మహిళా సంఘాలు తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. తనపై, తన కుటుంబంపై ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేసిన మహిళా సంఘం నేత సంధ్య, ఆ డిబేట్‌ను ప్రసారం చేసిన చానెల్‌పైన పరువు నష్టం దావా వేస్తానని ఆమె హెచ్చరించారు.