చలువ చేసే ఉల్లి గుండెజబ్బులకి దివ్యఔషధం

419
uses of onion

ఉల్లి చేసే మేలు తల్లిచేయదని సామెత. ఎర్ర ఉల్లి గుండెజబ్బులకి దివ్యఔషధం. మనశరీరంలోని కొలెస్ట్రాల్‌ని పోగొడుతుంది. కఫం, శీతలానికి విరుగుడు. ఉల్లిని ఎక్కువగా వాడేవారిలో కేన్సర్‌ రోగుల సంఖ్య తక్కువట. చైనాలో ఉల్లిని ఎక్కువగా వాడతారు కాబట్టే ప్రపంచ మొత్తంలో 40శాతం పొట్టకి సంబంధించిన కేన్సర్‌ కేసులు చైనాలో తక్కువ. భారత్‌, భూమధ్య రేఖా ప్రాంతం, తూర్పుదేశాల్లో ఉల్లిని బాగా వాడతారు. వేసవిలో దాహం తాపాన్ని తగ్గిస్తుంది కాబట్టి బాగా ఎక్కువ వాడాలి. పచ్చి ఉల్లిని వాడటం శ్రేష్ఠం.

100గ్రా. ఉల్లిలో 50 కేలరీలుంటాయి. కాబట్టి రోజూ ప్రతివ్యక్తీ 70 కేలరీలు తీసుకోవాలి. కంటికి, జ్ఞాపకశక్తికి, జీర్ణక్రియకి దోహద కారి. ఉడికించిన ఉల్లి చర్మపు రంగు నిగారింపుకి, ఆకల్ని పెంచ టానికి దోహదం చేస్తుంది. స్త్రీలలో వంధ్యత్వాన్ని పోగొడుతుంది. అజీర్ణంగా అన్పిస్తే ఉల్లిని చిన్నముక్కలుగా తరిగి నిమ్మరసం పిండి అన్నంలో తినాలి.

Hospital

 

అతిసారం వల్ల నీళ్ల విరేచనాలు అవ్ఞతుంటే ఉల్లిని అరగదీసి రోగి బొడ్డుపై రాయాలి. లేదా బట్టపై ఉల్లిరసం పట్టించి బొడ్డుపై కట్టాలి. కలరా వ్యాధికి ఉల్లిరసంలో ఉప్పు కలిపి తాగించాలి. 15నిము షాలకోసారి 10ఉల్లిచుక్కల్ని పుదీనారసాన్ని కలిపి తాగించాలి.

హైబి.పి ఉన్నవారు పచ్చిఉల్లిని తినాలి. వాంతులకి ఉల్లిలో ఉప్పు కలిపి నమలాలి. మానసిక అలసట పోవాలంటే ఉల్లిని తింటుండాలి. మూత్రం జారీ కావాలంటే ఉల్లిని నీటిలో ఉడికించి ఆ కషాయాన్ని రోజూ మూడుపూటలా తాగాలి. దగ్గు, గొంతునొప్పి, జలుబుకి ఉల్లిని చితకగొట్టి ముక్కు దగ్గర వాసన చూస్తుండాలి. జాండీస్‌కి, ఉల్లిని మధ్యలో చీల్చి వెనిగర్‌లో వేసి ఉప్పు, మిరియంతో కలిపి ఉదయం సాయంత్రం తినాలి.