‘అమెజాన్ ప్రైమ్‌ డే’ఆఫర్లు… మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్ 48 గంటల సేల్‌

261
prime day offers2019

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ జులై 15 నుంచి 48 గంటల పాటు అంటే జులై 16 అర్ధరాత్రి వరకు ప్రైమ్‌ డే సేల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అన్ని కేటగిరీలతో పాటు మొబైల్‌ ఫోన్లలోనూ భారీ ఆఫర్లు అందించనుంది. మరికొన్ని గంటల్లో సేల్‌ ప్రారంభమవనున్న సందర్భంగా అమెజాన్‌ స్మార్ట్‌ ఫోన్లకు సంబంధించిన పలు ఆఫర్లు ప్రకటించింది. అలాగే దాదాపు వెయ్యి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. అందులో స్మార్ట్‌ ఫోన్లు, పవర్‌ బ్యాంక్‌, ఆడియో పరికరాలతో పాటు పలు ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లు అందుబాటులో ఉండనున్నాయి.

తగ్గనున్న ధరలు..
ప్రత్యేక అమ్మకాల సందర్భంగా.. పలు స్మార్ట్‌ ఫోన్ల ధరలను ఆయా కంపెనీలు తగ్గించనున్నట్లు అమెజాన్‌ పేర్కొంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎమ్‌30 ధరను రూ.14,990 నుంచి 13,999కు తగ్గనుంది. హానర్‌ 8సీని వెయ్యి రూపాయిలు తగ్గించి రూ.7,999కి అందించనున్నారు. ఇక 16,999 ధరతో మార్కెట్లోకి వచ్చిన ఎమ్‌ఐ ఏ2 ప్రస్తుతం రూ.10,389గా ఉంది. దీని ధరను ప్రైమ్‌ డే సందర్భంగా మరింత తగ్గించి 9,999కి అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితో పాటు ధరలు తగ్గనున్న మరికొన్ని స్మార్ట్‌ ఫోన్లు..
ఒన్‌ప్లస్ 6టీ

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎమ్‌20

రియాల్మీ యూ1

నోకియా 8.1 నోకియా 6.1ప్లస్‌

శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్‌10

వివో వీ15 ప్రో

ఇలా మరిన్ని ఫోన్లను కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంచనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. అలాగే పలు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు కూడా ఉన్నట్లు ప్రకటించింది. ప్రైమ్‌ డే సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న అనేక డీల్‌లు, డిస్కౌంట్లు, ఆఫర్లను సంబంధించిన సమాచారాన్ని అమెజాన్‌ వెబ్‌సైట్‌లోని ఓ ప్రత్యేక పేజీలో ఉంచింది.

కొత్త ఫోన్లు ఇవే..
అమెజాన్‌ ప్రైమ్‌ డే సందర్భంగా.. ఒన్‌ప్లస్‌7 మిర్రర్‌ బ్లూ కలర్‌ ఆప్షన్‌తో ఒన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్‌ ధర 32,999గా నిర్ణయించారు. అలాగే ఎల్‌జీ డబ్ల్యూ30కి చెందిన అరోరా గ్రీన్‌ వేరియంట్‌, ఒప్పో ఎఫ్‌11 ప్రోకి చెందిన వాటర్‌ఫాల్‌ గ్రే వేరియంట్‌ కూడా మార్కెట్లోకి రానున్నాయి. వీటితో పాటు శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎమ్‌40 కాక్‌టెయిల్‌ ఆరేంజ్‌ గ్రేడియంట్‌ను రూ.19,990కి సేల్‌కి ఉంచనున్నారు. మరికొన్ని కొత్త ఫోన్లను కూడా లాంఛ్‌ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది.