రేపు 16 వేల ఫోన్ 7 వేలకే

301
amazon prime day offer

రూ.16 వేల స్మార్ట్ ఫోన్ రూ.7 వేలకే లభిస్తే ఠక్కున అందుకుంటారు కదూ. ఇలాంటివెన్నో కళ్లు చెదిరే ఆఫర్లతో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ సిద్ధమైంది. ఈ ఆఫర్ల కోసం జులై 15 వరకు ఆగాల్సిందే. ‘అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్‌’లో భాగంగా ఈ డీల్స్ పొందొచ్చు. జులై 15 నుంచి 16 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

స్మార్ట్ ఫోన్లే కాకుండా వివిధ రకాల ప్రొడక్టులపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా నోకియా 5.1 స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌లో లభిస్తోంది. ఫోన్ అసలు ధర రూ.15,999 వుంది. ప్రైమ్ డేస్ సేల్‌లో మునుపెన్నడూ లేనివిధంగా నోకియా 5.1 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.6,999కే అందిస్తోంది.

నోకియా 5.1 స్మార్ట్‌ఫోన్‌లో 16 ఎంపీ రియర్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ ఎంటీ6755ఎస్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 5.5 అంగుళాల స్క్రీన్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వంటి చక్కటి ఫీచర్లు వున్నాయి.

ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారికి

అలాగే కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారికి ఇదే మంచి తరుణం. లెనొవొ (లెనొవొ ఐపాడ్ 3307వ జనరేషన్ ఏఎండీ ఈ2-9000 మోడల్‌) ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌లో భాగంగా ఏకంగా రూ.26,500 తగ్గింపు ధరకే అందిస్తోంది. ఏడాది పాటు వారంటీ లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌పై ఎక్స్చేంజ్ రూపంలో రూ.14,000 వరకు తగ్గింపు కూడా పొందొచ్చు.

ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ మెమరీ, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ 5 గంటలపాటు వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.