వర్జీనియా సైంటిస్ట్ అవార్డు గెలుచుకున్న తెలుగు తేజం

369
telugu-guy-got-virginia-scientist-award

భారత సంతతికి చెందిన ఇద్దరు ఇండో-అమెరికన్లు ప్రతీక్ నాయుడు, అరుణ్‌ జె సన్యాల్‌ ప్రతిష్ఠాత్మక వర్జీనియా సైంటిస్ట్‌ అవార్డు దక్కించుకున్నారు. థామస్ జెఫెర్సన్ హై స్కూల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో చదువుతున్న పార్థిక్‌ నాయుడు 17 ఏళ్ల ప్రాయంలోనే కేన్సర్‌ వ్యాధిపై అధ్యయనం చేసేందుకు మెషీన్‌ లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొంచినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. మానవ ఆరోగ్య మెరుగుదలకు విశేష పరిశోధనలు చేసిన వారిలో ఆరుగురిని 2018 ఔట్‌స్టాండింగ్‌ స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మాథ్స్‌) అవార్డుకు ఎంపిక చేసినట్టు వర్జీనియా గవర్నర్‌ రాల్ఫ్‌ నార్తమ్‌ తెలిపారు.



 

రెజినెరోన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ లో ఏడవ రాంక్ సాధించిన ప్రతీక్ తాను చేస్తున్న సాఫ్ట్ వేర్ అభివృద్ధికి 70,000 డాలర్లను బహుమతి గా పొందాడు.