నేడే కమల్ హాసన్ పొలిటికల్ అరంగేట్రం

269
today kamal hasan political entry

తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిష్కృతం కానుంది. రాజకీయ రంగ ప్రవేశం చేయునున్నట్లు గతంలోనే ప్రకటించిన తమిళ సినీ నటుడు కమల్ హాసన్ బుధవారం తన పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించాలని నిర్ణయించారు. తన రాజకీయ ప్రస్థానానికి వేదికగా మదురైను కమల్ ఎంపిక చేసుకున్నారు. మదురైలోని ఒట్టకట్టాయి గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం 6 గంటలకు కమల్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. జెండాను ఆవిష్కరించనున్నారు. దీంతో ఆయన పార్టీ పేరేంటో.. జెండా ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఈ సభను విజయవంతం చేసేందుకు కమల్ అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు.



ఈ బహిరంగ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరుకానున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కమల్ హాసన్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో కమల్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని కేజ్రీవాల్ ఆకాంక్షించారు. బుధవారం ఉదయం రావేుశ్వరంలో ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటిని సందర్శించడంతో కమల్ రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు పడనుంది. ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమానికి రజనీకాంత్‌ను కూడా కమల్ ఇప్పటికే ఆహ్వానించారు. రజినీ హాజరవుతారా లేదా అని విలేకరులు కవుల్‌ను ప్రశ్నించగా.. అది ఆయన నిర్ణయుమని చెప్పారు. డీఎంకే ప్రెసిడెంట్ కరుణానిధితో కూడా కవుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకటన కార్యక్రమానికి రావాల్సిందిగా కరుణానిధిని, స్టాలిన్‌ను కమల్ కోరారు. ఇక కమల్ రాజకీయాల్లో రావడాన్ని లెఫ్ట్ నేతలతో సహా పలువురు స్వాగతించారు. డీఎమ్‌డీకే నేత కెప్టెన్ విజయుకాంత్ కూడా కమల్ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రానున్నట్లు 2017 నవంబర్‌లో కమల్ హాసన్ ప్రకటించారు. ఆయన సహ నటుడు రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.