రష్మీకి ప్రపోజ్ చేసేశాడు ..వాచ్ ఫుల్ వీడియో

2418
Sudigali Sudheer Love Proposal To Anchor Rashmi

టీవీ తోపాటు సినిమాల్లోను తెగ నటించేస్తున్నారు రష్మి గౌతమ్.. సుధీర్. వీరిద్దరికీ ఫేమ్ తెచ్చి పెట్టిన ప్లాట్ ఫాం ఒకటే. జబర్దస్త్ వేదికగానే జనాలకు పరిచయం అయ్యారు. ఆన్ స్క్రీన్ వీరిద్దరూ కలిసి కనిపించినది కూడా అక్కడే. ఇతర కార్యక్రమాల్లో కూడా వీరిద్దరూ కలిసి చేస్తున్న హంగామా బాగానే ఉంది. కాకపోతే ఎంతసేపూ వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ.. రష్మీకి లైన్ వేస్తున్న సుధీర్ అన్న యాంగిల్ లో కథ నడుస్తూ ఉంటుంది.రీసెంట్ గా వీరిద్దరికి ఓ ఛానల్ లో ఎంచక్కా పెళ్లి కూడా చేసేశారు. ఓ పండుగ నాడు ప్రసారం అయిన ఈ ఎపిసోడ్ లో.. ఇద్దరికి ఆన్ స్క్రీన్ పెళ్లి చేసేసి.. చివరలో ఇదంతా సుధీర్ కల అని తేల్చారు. సర్లే వీళ్ల కామెడీ పీక్స్ కి చేరిందని అనుకుంటే.. ఇఫ్పుడు మరో రచ్చ మొదలుపెట్టారు. ఈటీవీలోనే ప్రసారమయ్యే ఢీ కార్యక్రమంలో.. ఇప్పుడు రష్మికి సుధీర్ నేరుగానే ప్రపోజ్ చేశాడు. నిజంగా ఓ అబ్బాయి.. తనకు సుదీర్ఘ కాలంగా తెలిసిన అమ్మాయికి తన ప్రేమను ఎలా తెలియచేస్తాడో.. అంత పక్కాగాను స్క్రిప్ట్ ఉంది.ఇంకా చెప్పాలంటే.. కొన్ని లవ్ స్టోరీ మూవీస్ లో ప్రపోజ్ చేసే సన్నివేశం కంటే కూడా.. ఇదే పక్కాగా ఉంది. తను నాలుగేళ్లుగా రష్మీని ప్రేమిస్తున్న సంగతి చెప్పేసి.. ఐలవ్యూ అనేశాడు సుధీర్. కానీ.. ఈ సీన్ మొత్తం మీద ఎక్కడా రష్మీ మాత్రం మాట్లాడలేదు. ఆ మాటే జడ్జెస్ అడిగితే.. మౌనం అర్ధాంగీకారం అనేశాడు సుధీర్. ఇదేమీ కామెడీ ప్రోగ్రాం కాదు.. డ్యాన్స్ షో. మరి దీనికి తర్వాత ఎలాంటి కవరింగులు ఇస్తారో చూడాలి.