జియో డేటా స్పీడ్‌లో తేడా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా

404
speed-change-in-jio-data

ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే చోట నిలబడి రిలయన్స్ జియో సిమ్ వాడుతూ స్పీడ్ టెస్ట్ లాంటి యాప్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేస్తే మీకూ, మీ ఫ్రెండ్‌కీ వేర్వేరు స్పీడ్‌లు రావడం గమనించవచ్చు.



ఇలా ఒకే ప్రదేశంలో ఉన్నా తమకు నెట్ స్పీడ్ భిన్నంగా వస్తోందని తరచూ చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు. దీనికి ప్రధానంగా రెండు అంశాలు కారణం అవుతాయి. ప్రతీ ఫోన్‌లోనూ రేడియో అనే చిప్ ద్వారానే మనం చేసే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, మొబైల్ డేటా లభిస్తుంటాయి. ఈ చిప్ నిరంతరం మనకు దగ్గరలో ఉండే మొబైల్ టవర్ నుంచి సిగ్నళ్లని స్వీకరిస్తూ ఉంటుంది.

ఈ రేడియో చిప్ ఖరీదైన ఫోన్‌లలో శక్తివంతంగా ఉంటుంది. తక్కువ ధర ఉన్న ఫోన్‌లలో అంత సరిగా పనిచెయ్యదు. ఈ కారణం చేతే కొన్ని ఫోన్‌లలో కాల్ క్వాలిటీ బాగుంటుంది. సిగ్నల్ క్వాలిటీ బాగుంటుంది. కొన్నింటిలో బాగుండదు. రేడియో చిప్ సరిగా డేటాని స్వీకరించలేకపోయినప్పుడు మనకు ఇంటర్నెట్ స్పీడ్ కూడా తక్కువ వస్తుంది.

ఇక రెండో కారణం చూస్తే.. రిలయన్స్ జియో ప్రధానంగా 2300 మెగాహెర్జ్, 1800 మెగాహెర్జ్, 850 మెగాహెర్జ్ అనే మూడు ఫ్రీక్వెన్సీ బాండ్‌లలో పనిచేస్తుంది. ఒక్కో ఫోన్ ఒక్కో ఫ్రీక్వెన్సీ బాండ్‌కి కనెక్ట్ కావచ్చు. దాని వల్ల నెట్ స్పీడ్‌లో తేడా వస్తుంది. కొన్ని ఫోన్‌లు అన్ని బాండ్‌లను సపోర్ట్ చెయ్యకపోవచ్చు కూడా!

 

speed change in Jio Data

If two friends are in the same place and use the Reliance Jio Sim, the speed test is open and the Internet speed checks that you and your friend have different speeds.

Often, there are many complaints that they are in the sameplace, but they have difference in net speed. This is mainly due to two factors. Each smart phone, has a chip which constantly receives signals from a nearby mobile tower SMS and mobile data.

This radio chip is powerful on expensive phones. Cheap phones do not work properly. For this reason, the quality of the call is good on some phones. The signal quality is good at some. When the radio chip is not properly received the signals, we also have an slow Internet speed.

The second reason is that Reliance Jio operates mainly in three frequency bands, 2300 MHz, 1800 MHz and 850 MHz. Each phone can connect to a frequency link. That’s why the speed of Net ​​comes into play. Some phones do not even support all links!