శాంసంగ్ కొత్త గెలాక్సీఎ50ఎస్ స్మార్ట్‌ఫోన్ విడుదల

309
samsung galaxy

గెలాక్సీ ఎ50ఎస్ పేరిట శాంసంగ్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.22,999 ఉండగా, 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.24,999 గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ50ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.