ఈ రోజు రాశి ఫలితాలు–శుక్రవారం 13 సెప్టెంబర్ 2019

294
today horoscope details

మేష రాశి : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ దానికి సరిపడా ఖర్చులు ఉండటం వల్ల డబ్బు పొదుపు చేయలేరు. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాల కారణంగా మనశ్శాంతి కోల్పోతారు. మిత్రులకు లేదా బంధువులకు ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.

వృషభ రాశి :ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలోవిదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.

మిథున రాశి :ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామి తో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటక రాశి :ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలగడం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది. కావునా కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.

సింహ రాశి :మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి.

కన్య రాశి :ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వ స్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.

తుల రాశి :ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవడం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.

వృశ్చిక రాశి :ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు రాశి :ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలించే దినం. రావలసినబకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకొని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

మకర రాశి :ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.

కుంభ రాశి :ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

మీన రాశి :ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర లేదా దంత సంబంధ మైన ఆరోగ్య సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి. ఉద్యోగంలో అనుకోని సమస్య వచ్చే అవకాశముంది.