రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగస్థలం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ హిట్ కొట్టి బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల వసూళ్ళు సాధించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, చంద్రబోస్ లిరిక్స్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, అనసూయల పర్‌ఫార్మెన్స్ సినిమా సక్సెస్‌లో సగభాగం అయ్యాయి. ఈ చిత్రంలో రంగమ్మ.. మంగమ్మ అనే పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మానసి పాడిన ఈ పాటని చిన్న పిల్లల నుండి పెద్దోళ్ల వరకు తెగ పాడేసుకుంటున్నారు. కొందరు సమంత మాదిరి స్టెప్పులు కూడా వేస్తున్నారు.
అయితే ఓ తాతయ్య రంగమ్మ మంగమ్మ సాంగ్‌ని తనకి నచ్చిన స్టైల్‌లో పాడి సమంతని ఇంప్రెస్ చేశాడు. ఓ నెటిజన్ తన ట్విట్టర్‌లో సమంత.. మీ రంగమ్మ.. మంగమ్మ సాంగ్ చాలా పాపులర్ అయింది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు ఈ పాట పాడుకుంటున్నారని చెబుతూ తాత పాడిన పాట వీడియోని షేర్ చేశాడు. ఇది సమంతకి కూడా నచ్చడంతో రీ ట్వీట్ చేసి మేడ్ మైడే అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
@Samanthaprabhu2 Sister your song most popular to everywhere to sing not barriers of age man #Thatayya rocking , Thanks 🙏 what fantastic song giving us..! pic.twitter.com/CPRyu0fDil
— 𝕂𝔸𝕊𝕀ℝ𝔼𝔻𝔻𝕀 𝕊𝕌ℝ𝔼𝕊ℍ (@KasireddiSuresh) May 26, 2018
😂😂😂made my day https://t.co/QMhN4UHhWj
— Samantha Akkineni (@Samanthaprabhu2) May 26, 2018