రెడ్‌మీ 70 ఇంచుల 4కె టీవీ కేవలం రూ.38వేలకే

307
redmi-tv-with-70-inch-4k-launched-in-china

మొబైల్స్ తయారీదారు షియోమీ.. రెడ్‌మీ టీవీ 70 ఇంచుల నూతన 4కె టీవీని చైనా మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో 64 బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ టీవీని బ్లూటూత్ రిమోట్ లేదా వాయిస్ కమాండ్లతో ఆపరేట్ చేయవచ్చు. అలాగే డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఇందులో అందిస్తున్నారు. దీంతోపాటు 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 తదితర ఇతర ఫీచర్లను కూడా ఈటీవీలో అందిస్తున్నారు. సెప్టెంబర్ 10 తేదీ నుంచి ఈ టీవీని చైనా మార్కెట్‌లో విక్రయించనున్నారు. త్వరలోనూ భారత్‌లోనూ ఈ టీవీని విడుదల చేస్తారని తెలిసింది. కాగా ఈ టీవీ ధ‌ర 531 డాల‌ర్లుగా (దాదాపుగా రూ.38వేలు) ఉంది.