రైతు కళ్ళల్లో ఆనందం నింపిన రామగుండం ఎమ్మెల్యే

629
farmer-got-pattadar-passbook-by-ramagundam-mla
farmer-got-pattadar-passbook-by-ramagundam-mla

ఎల్కలపల్లి గ్రామానికి చెందిన చిట్టబోయన రాజయ్య అనే రైతు కుటుంబం పూర్తిగా ‌‌వ్యవసాయ ఆధారిత కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడిని పరిస్థితి .. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కనీసం పట్టాకుడా చేసుకోలేని దుస్థితి … ఇదే అదను చూసుకొని కొంత మంది ఇతని భూమిని పట్టా చేసుకొన్నారు… తన భూమి తనకు పట్టా చేయాలని రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతు చివరకు మన గౌరవ రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారిని కలువగా…

ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారులు ఎల్కలపల్లి గ్రామానికి వచ్చి మెూకాపై సమగ్ర విచారణ జరిపి ఎట్టకేలకు రైతుకు పట్టాదారు పాస్ బుక్ ని అందజేశారు… దీనికి సహకరించిన శాసనసభ్యునికి మరియు రెవిన్యూ అధికారులకు రైతు కృతౙతలు తెలియజేశారు.. పట్టాదారు పాస్ బుక్ ని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజు రైతుకి ఇవ్వడం జరిగింది… రైతు కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు ‌రాలడం కొసమెరపు…