ఈ రోజు రాశి ఫలితాలు–శుక్రవారం 30 ఆగస్టు 2019

359
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం వర్ష రుతువు; శ్రావణ మాసం; బహుళ పక్షం అమావాస్య: సా.4-35 తదుపరి శుక్లపక్ష పాడ్యమి మఘ నక్షత్రం: సా.6-42 తదుపరి పుబ్బ అమృత ఘడియలు: సా.4-27 నుంచి 5-57 వరకు వర్జ్యం: ఉ.7-29 నుంచి 8-59 వరకు తిరిగి రా.2-08 నుంచి 3-38 వరకు
దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-06 వరకు తిరిగి మ.12-25 నుంచి 1-15 వరకు రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.5-48; సూర్యాస్తమయం: సా.6.14

మేష రాశి : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభ రాశి : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మిథున రాశి : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

కర్కాటక రాశి : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

సింహ రాశి : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చు లు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

కన్య రాశి : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

తుల రాశి : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చిక రాశి : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

ధనుస్సు రాశి : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

మకర రాశి : ఈ రోజు వ్యాపార లావాదేవీలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వివాహ విషయంలో అనుకూలమైన ఫలితం వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఉద్యోగ విషయంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వివాదాలు పరిష్కరించ బడతాయి.

కుంభ రాశి : ఈ రోజు వృత్తి విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మీ సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. నరాలు, మెడకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడే అవకాశముంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. డబ్బు వచ్చినప్పటికీ అనవసరమైన వాటి మీద ఖర్చు చేయాల్సి వస్తుంది.

మీన రాశి : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంటుంది. దాని కారణంగా మానసికంగా ఆందోళనకు లోనవుతారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.