త్వరలో కమల్ హాసన్ కొత్త టీవీ ఛానల్ లాంచింగ్

290
kamal-hasan-going-to-launch-new-tv-channel
kamal-hasan-going-to-launch-new-tv-channel

మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ కొత్త టీవీ ఛానల్ పెట్టాలని భావిస్తున్నారు. అనుమతుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 7వ తేదీన తన పుట్టినరోజున టీవీ ఛానల్ ప్రారంభించే యోచనలో కమల్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సంవత్సరం చివరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రస్తుతం కమల్‌ ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం రాజకీయ నిపుణుడు ప్రశాంత్‌ కిషోర్‌తో కూడా ఆయన టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి? ప్రజలకు దగ్గరయ్యేందుకు ఏం చేయాలి? పార్టీని ఎలా బలపరచాలి? వంటి అంశాలపై ప్రశాంత్‌ సలహాలు, సూచనలు ఇచ్చారు.

ఈ విషయమై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఆ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంఎన్‌ఎం వివిధ పథకాలను అమలుచేయబోతుంది.  కమల్‌హాసన్‌ పుట్టినరోజైన నవంబర్‌ 7 నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోను ఒకే రోజు ఎంఎన్‌ఎం తరపున ప్రచారం చేపట్టేలా వ్యూహరచన చేస్తున్నారు.