NEET PG 2021 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

361

విద్యార్థుల‌కు ఒక అల‌ర్ట్‌. నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (NBE) మంగళవారం నీట్ పీజీ 2021 ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది.

పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ (నీట్ పీజీ2021) కోసం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 18న జరగనుంది. నీట్ పేయింగ్ అప్లై లింక్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమ‌వుతుంది.

అప్లై చేసుకోవ‌డానికి చివరి తేదీ మార్చి 15. కాగా గతంలోనే ఎన్బీఈ నీట్ పీజీ 2021, నీట్ ఎండీఎస్ 2021 పరీక్ష తేదీలను విడుదల చేసింది.

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఎన్బీఈ 2021 ఏప్రిల్ 18న నీట్ పీజీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు హజరయ్యే విద్యార్థులు మ‌రిన్ని వివ‌రాల‌ను ఎన్బీఈ అధికార వెబ్ సైట్ nbe.edu.inలో తెలుసుకోవచ్చు.

అలాగే నీట్ పీజీ 2021 ప‌రీక్ష‌ కంప్యూటర్ ఆధారంగా జ‌రుగుతుంది. గుర్తుంచుకోండి.. దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 15, నీట్ పీజీ 2021 ప‌రీక్ష తేదీ: ఏప్రిల్ 18, నీట్ పీజ్ 2021 ఫ‌లితాలు: మే 31లోగా.

ఈ పరీక్షకు అప్లై చేయాలనుకునే అభ్యర్తులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తించబడిన ఒక సంస్థ జారీ చేసిన ఎంబీబీఎస్ డిగ్రీ (తాత్కలిక లేదా శాశ్వత) సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి.

అలాగే ఎంసీఐ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. నీట్ పీజీ 2021 అభ్యర్థులు జూన్ 30న లేదా అంతకుముందు ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) అనేది దేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అలాగే డెంటల్ హస్పిటల్స్‏లో అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబీబీఎస్), డేంటల్ కోర్సులు (బీడీఎస్) చేయాలనుకునే అభ్యర్థులకు ప్ర‌వేశ ప‌రీక్ష‌.

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ ) అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య పరీక్షలకు ఎంట్రన్స్.