మోటో ఇ6ఎస్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.7,999

334

మొబైల్స్ తయారీదారు కంపెనీ మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఇ6ఎస్‌ను ఈ రోజు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.7,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 23వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది.

ఈ ఫోన్‌లో.. 6.1 ఇంచుల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ఫీచర్లను అందిస్తున్నారు.