సెప్టెంబర్ 29 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

261
amazon great indian festive season

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ దసరా పండుగ సందర్భంగా ఈ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు సెప్టెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ సేల్‌లో వినియోగదారులు ఎస్‌బీఐ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. పలు ఉత్పత్తులను నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు. పలు ఫోన్లకు గాను అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు.

సేల్‌లో రూ.900 వరకు విలువైన ఫెస్టివ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను వినియోగదారులు పొందవచ్చు. కాగా ఈ సేల్ సందర్భంగా అమెజాన్.. ఫెస్టివ్ యాత్ర పేరిట దేశంలోని ఆయా ప్రాంతాల్లో 6వేల కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర చేపట్టనుంది. 13 నగరాలను కలుపుతూ ఓ భారీ ట్రక్కులో ఈ యాత్ర సాగుతుంది. ఇందులో భాగంగా అమెజాన్ ప్రతినిధులు ఆయా నగరాల్లో ఉన్న అమెజాన్ కస్టమర్లను కలుసుకుని వారి అభిప్రాయాలను సేకరిస్తారు. టాటా మోటార్స్ భాగస్వామ్యంతో అమెజాన్ ఈ యాత్రను చేపడుతుండగా ఈ యాత్ర ముందుగా ఢిల్లీలో ప్రారంభమై ఆ తరువాత లక్నో, అహ్మదాబాద్, హైదరాబాద్ మీదుగా కొనసాగి బెంగళూరులో ముగియనుంది.