మొబైల్స్ తయారీదారు సంస్థ హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ వైల్డ్‌ఫైర్ ఎక్స్‌ను ఇండియన్ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను అందుబాటు లోకి తేనున్నారు .ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,999 గా ఉంది.
హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 6.22 ఇంచుల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.