తెల్ల జుట్టు ను నల్లగా ….ఇంట్లోనే ఎలా ?

1765
home remedy

20 ఏళ్లు కూడా లేవు అప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. టీనేజ్ యువతీ యువకుల్లో ఆందోళన. దీనికి తీసుకునే ఆహారం ప్రధాన కారణంగా చెబుతుంటారు వైద్యులు. ఆ వచ్చే తెల్ల వెంట్రుకలను కవర్ చేసుకోవడానికి మార్కెట్లో దొరికే కలర్స్ వేస్తే సైడ్‌ఎఫెక్ట్‌లు వస్తాయేమోనని భయం. ఈ కెమికల్స్ వలన జుట్టు రాలిపోవడం కూడా జరుగుతుంటుంది. సహజ పద్దతుల్లో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చంటోంది ఆయుర్వేదం. ఈ పద్దతిలో మన ఇంట్లోనే జుట్టుని ఆరోగ్యంగా నల్లగా ఉంచుకోవచ్చంటున్నారు. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..




 

మెత్తగా రుబ్బిన గోరింటాకు: 100 గ్రాములు
కాఫీ పొడి : 3 గ్రాములు
పెరుగు: 25 గ్రాములు
నిమ్మరసం: 4 స్పూన్లు
ఖదిరము (కటేచు) : 3 గ్రాములు
బ్రహ్మీ చూర్ణం: 10 గ్రాములు
ఉసిరి చూర్ణం: 10 గ్రాములు

వీటన్నింటినీ ఓ ఇనుప మూకుడులోకి తీసుకుని బాగా కలిపి ఓ పది నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తరువాత దాన్ని జుట్టు కుదుళ్లకు అంటేలా మొత్తం వెంట్రుకలకు పట్టించాలి. అరగంట పాటు అలానే ఉంచుకుని తరువాత మామూలు నీటితో కడిగేయాలి. అదే రోజు వేడినీటితో కడక్కూడదు. ఆ తరువాతి రోజు గోరు వెచ్చని నీళ్లతో తక్కువ గాఢత కలిగిన షాంపూని ఉపయోగించి జుట్టుని శుభ్రపరచాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయని ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు.