ఇక పై డ్యూయల్ సిమ్ ఐఫోన్లు

341
iphone xs max

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు నూతన స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్ సంస్థ. కూపర్‌టినో వేదికగా డ్యూయల్ సిమ్ కలిగిన ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఎక్స్‌ఎస్ మ్యాక్స్, ఎక్స్‌ఆర్ రకాల ఫోన్లను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌ఎస్‌లో 5.8 అంగుళాల టచ్‌స్క్రీన్, ఎక్స్‌ఎస్ మ్యాక్స్‌లో 6.5 అంగుళాల టచ్‌స్క్రీన్, ఎక్స్‌ఆర్‌లో 6.1 టచ్‌స్క్రీన్ ఉన్నాయి.


-మూడు రకాల మోడళ్లను ఆవిష్కరించిన యాపిల్

ధరల విషయానికి వస్తే 64జీబీ, 128 జీబీ, 256 జీబీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్లు 749 డాలర్ల నుంచి 1,099 డాలర్ల వరకు ఈ ఫోన్లు లభించనున్నాయి. వెనుకవైపు 12 మెగాపిక్సెల్ రియల్ కెమెరా, ముందుభాగంలో 7 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ ధర కలిగిన ఐదు రంగుల్లో లభించనున్న ఎక్స్‌ఆర్‌లో 6.1 అంగుళాల తాకేతెర, 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, స్టీరియో సౌండర్, బయోమెట్రిక్ ద్వారా ముఖాన్ని గుర్తించే సదుపాయం ఈ ఫోన్లో ఉంది. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో టీమ్ కుక్ మాట్లాడుతూ..ప్రపంచ స్మార్ట్‌ఫోన్ దశదిశను ఈ ఫోన్లు మార్చివేయనున్నదన్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో తన తొలిస్థానాన్ని పదిలం చేసుకునే అవకాశం ఉందన్నారు. గత వాటితో పోలిస్తే 30 శాతం అత్యంత వేగవంతంగా పనిచేయనున్నది