క్యాష్‌బ్యాక్ ఆఫర్..! వన్‌ప్లస్ 7 ఫోన్లపై అమెజాన్‌లో

274
cashback-on-oneplus-7-phones-in-amazon
cashback-on-oneplus-7-phones-in-amazon

అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు వన్‌ప్లస్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నది. వన్‌ప్లస్ 7, 7 ప్రొ ఫోన్లను ప్రీపెయిడ్ పద్ధతిలో కొనుగోలు చేసే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు రూ.500 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు వన్‌ప్లస్ ప్రకటించింది.

ఇవాళ అర్ధరాత్రి 11.59 గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వన్‌ప్లస్ తెలిపింది. అయితే ఆ క్యాష్‌బ్యాక్ వినియోగదారులకు చెందిన అమెజాన్ పే బ్యాలెన్స్‌లో జమ అవుతుందని వన్‌ప్లస్ తెలిపింది. కాగా వన్‌ప్లస్ 7 రూ.32,999 ప్రారంభ ధరకు లభిస్తుండగా, వన్‌ప్లస్ 7 ప్రొ రూ.48,999 ప్రారంభ ధరకు లభిస్తున్నది.