బ్యాంకు ఆప్ వాడే వారూ … కాస్త జాగ్రత్త

355
be-aware-of-your-bank-app

మొబైల్‌ ఫోన్లలో బ్యాంకు యాప్‌లను ఉపయోగించి నగదు బదిలీలు చేసే వారికి ఇప్పుడు అటువంటి వాటి నుండి ముప్పు పొంచి ఉందని గ్లోబల్‌ ఐటీ సెక్యూరిటీ సంస్థ క్విక్‌ హీల్‌ తెలియజేసింది. హ్యాకర్స్‌ బ్యాంకు యాప్‌ లాంటిదే నకిలీ యాప్‌ను సృష్టించే అవకాశం ఉందని.. ఈ నకిలీ యాప్‌ బారిన పడే బ్యాంకులలో భారత్‌లోని ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, యాక్సిస్‌ బ్యాంకు వంటివి ఉన్నాయని పేర్కొంది. దాదాపు 232 బ్యాంకు మొబైల్‌ యాప్స్‌ ఈ హ్యాకర్స్‌ బారిన పడే అవకాశాలున్నాయట. నకిలీ యాప్‌ ఈ బ్యాంకుల మొబైల్‌ యాప్‌లను గుర్తించి వారికి సంక్షిప్త సందేశాలను పంపడానికి ఎక్కువ అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.మొదట మన ఫోనుకు ‘ఆండ్రాయిడ్‌.బ్యాంకర్‌.ఏ2ఎఫ్‌8ఏ’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయమని సంక్షిప్త సందేశం వస్తుంది. దానిని మన ఫోనులోకి డౌన్‌లోడ్‌ చేసుకుంటే నిజమైన బ్యాంకు యాప్‌లకు వచ్చినట్లే అన్ని వివరాలను అడుగుతుంది. వాటిని పూర్తి చేసిన తరువాత ఏటీఎం పాస్‌వర్డ్‌ను అడుగుతుంది. వివరాలన్నింటిని సమర్పించిన తరువాత అకౌంట్‌లో ఉన్న నగదును అంతా కాజేస్తారు. నిజమైన మొబైల్‌ యాప్‌లు ఎలాగైతే లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వంటివి ఎలా అడుగుతాయో వీటికి కూడా అదే విధానం ఉంటుంది.

‘బ్యాంకు యాప్‌లను వినియోగించే వారు ఇటువంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలి. సెల్ ఫోన్ లకు వచ్చే ఎటువంటి లింకులను ఓపెన్‌ చేయకూడదు. ఇతరులు పంపే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయవద్దు. వారు అడిగిన సమాచారాన్ని వారికి అందించకూడదు. ఒకవేళ అందించినట్లయితే హ్యాకర్స్‌ అసలైన యాప్‌లోనికి లాగిన్‌ అయి నగదును కాజేస్తారు.’ అంటూ క్విక్‌ హిల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కత్కార్‌ తెలిపారు.

బ్యాంకు నుంచి ఎటువంటి లింక్‌లు రావని వినియోగదారులు గమనించాలని.. ఒకవేళ అటువంటి యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోమని ఏమైనా సందేశాలు వస్తే బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించారు.

 

Be aware of your Bank app

The global computer security firm Quick Heal said that money transfers threatened by banking transactions using cell phones. There is a possibility to create a fake application like the hacker bank application. SBI, HDFC, ICICI, IDBI and Axis Bank in India are among the fraudulent banks. Approximately 232 mobile banking applications are likely to be affected by these hackers. Experts suggest that the fake app is more likely to detect mobile apps for these banks and send them short messages.

Sanjay Katkar, Deputy General Manager, Quick Hill Technologies Ltd. Said “We will first have a small message to download the Android banker 2F8A application. If it is downloaded to our phone, it will ask you all the details of the actual bank application. After completing them, the ATM asks for the password. After submitting all the details, the amount of the account is allocated. The app looks like actual mobile app and in the same the way they ask like the username and password.

“Those who use the banking machine do not have to ask for the things they asked for.” If the hackers are provided, they are connected to the original application and cash it out.”
Customers should note that there is no link from the bank. If you have messages to download such applications, bank managers should contact you.