ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్

420
ayush-pg-medical-seats-notification

ఈ నెల 2 నుండి 5 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలో ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2018 (AIAPGET) పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్వీకరించనున్నారు. గత నెల అక్టోబర్ 4వ తేదీన యూనివర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని యూనివర్సిటీ స్పష్టం చేసింది.
ఈ నెల 6 న ధ్రువపత్రాల పరిశీలన

ఈనెల 6వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియను ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి దూర విద్య కేంద్రం(పీజీఆర్ఆర్సీడీఈ), ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హైదరాబాద్‌ లో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరూ ధృవపత్రాల పరిశీలనకు తప్పనిసరిగా హాజరుకావాలని.. పూర్తి సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.in ను చూడాలని రిజిస్ట్రార్ ప్రకటనలో తెలిపారు.