ఇగ్నో ఓపెన్‌మ్యాట్ 2019

472
IGNOU openmat

ఓపెన్‌మ్యాట్: మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ ఓపెన్‌మ్యాట్. దేశవ్యాప్తంగా ఉన్న ఇగ్నో స్టడీసెంటర్ల ద్వారా ఈ కోర్సులను అందిస్తుంది.




 

అర్హతలు :
ఎంబీఏ (ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు). దీనికి ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా సీఏ/కాస్ట్ అకౌంటెన్సీ/సీఎస్ చేసినవారు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ :
ఇగ్నో నిర్వహించే ఓపెన్‌మ్యాట్‌లో అర్హత సాధించాలి.
అభ్యర్థులకు ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
ఓపెన్‌మ్యాట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీ డిప్లొమాల్లో నేరుగా కూడా ప్రవేశాలు పొందవచ్చు. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఇగ్నో.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. దూరవిద్యా విధానంలో పలు యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ ఇలా పలు ప్రత్యేక కోర్సులను అందిస్తూ పేరుగాంచిన విశ్వవిద్యాలయం. రెగ్యులర్ స్టడీస్‌కు ధీటుగా దేశవ్యాప్తంగా ఉన్న స్టడీసెంటర్ల/ఆన్‌లైన్ విధానం ప్రామాణికమైన మెటీరియల్‌తో కోర్సులను అందించడం, ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులను ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దడంలో ఇగ్నోకు గొప్ప పేరు ఉన్నది.

కోర్సుల వివరాలు :
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (పీజీడీహెచ్‌ఆర్‌ఎం)
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎఫ్‌ఎం)
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎంఎం)
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ప్రాక్టీస్ (పీజీడీఎఫ్‌ఎంపీ)


ఈ కోర్సులన్ని ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే అందిస్తారు. వీటి కాలపరిమితి రెండేండ్లు. గరిష్ఠంగా ఐదేండ్లలో పూర్తిచేయాలి. ప్రతి ఏటా జనవరి, జూలైలలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 15
వెబ్‌సైట్: https://onlineadmission.ignou.ac.in/entranceopenmat/