అనసూయపై నెటిజన్ అసభ్యకర కామెంట్… యాంకర్ ఘాటు రిప్లై

207
Anchor Anasuya Strong Counter To Netizen

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఓ నెటిజన్ కు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చింది.

దాదాపు మూడేళ్ల క్రితం అన‌సూయ‌ ఓ షోలో యాంక‌రింగ్ చేస్తూ క‌ళ్లు తిరిగి ప‌డిపోయింది.

దానికి సంబంధించిన ఫొటోలను సదరు నెటిజన్‌ ట్విట్ట‌ర్‌‌లో పోస్ట్ చేస్తూ షో ప‌బ్లిసిటీ కోస‌మే అనసూయ అలా కళ్లు తిరిగిపడిపోయిన‌ట్లు నటించింది అంటూ అస‌భ్యక‌ర పదం వాడుతూ కామెంట్ చేశాడు.

అది చూసి “ఇతరులను నిందించడం చాలా సులభం. ఇద్దరు పిల్లలకు తల్లినైన నాకు లో బీపీ ఉంది. 22 గంటలపాటు నిర్విరామంగా షూట్‌లో పాల్గొన్న తర్వాత తెల్లవారుజామున 5.30 గంటలకు నేను అలా కళ్లు తిరిగిపడిపోయాను.

ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండానే నాపై ఎలా కామెంట్‌ చేస్తావు మిస్టర్‌ ఆదిత్య?” అని అనసూయ రిప్లై ఇచ్చింది.

“నన్ను అసభ్యంగా దూషించాలనే ఉద్దేశంతోనే మూడేళ్ల క్రితం వీడియోను వెలికితీసి ఇలా కామెంట్‌ చేస్తున్నావా? నిన్ను కూడా అసభ్యంగా దూషించడానికి నాకు ఎలాంటి సిగ్గు, భయం లేదు.

ఎందుకంటే ముందు నువ్వు మొదలుపెట్టావు. కానీ ఇలా చేస్తున్నందుకు బాధగా ఉంది. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు” అని అనసూయ కూడా ఓ అసభ్యకర పదం వాడుతూ ఘాటుగా రిప్లై ఇచ్చింది ఆ నెటిజన్ కు.