వేలవి కాలం వచ్చేసింది. పుచ్చకాయల (వాటర్‌మిలాన్) సీజన్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడు మార్కెట్లో పుచ్చకాయలు కనిపిస్తున్నాయి.
వేసవి నుంచి ఉపశమనం పొందడానికి పుచ్చకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే చాలా మంది పుచ్చకాయలు తీనేటప్పుడు గింజలు తీసేసి పడేస్తుంటారు.
ఆ గింజలను ఏం చేసకుంటాం? ఖర్బుజ విత్తనాలుగా వాటిన తినలేముగా? అంటారామే. కానీ అలా చేయకండి. ఎందుకంటే పుచ్చకాయ గింజలు తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.
ఆ ప్రయోజనాల గురించిన వివరాలను మీ ముందుకు తెస్తున్నాను…
- వేసవి తాపం నుంచి మన్నలి మనం కాపాడుకోవడానికి, ఛరీరాన్ని చల్లబరుచుకోవడానికి ఈ పుచ్చకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి.
- నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయల్లో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికం.
- పుచ్చకాయలో అధిక క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారికి ఇది మంచి డైట్.
- పుచ్చకాయలో ఉండే లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.
- పుచ్చకాయ గింజల్లో విటమిన్-B అధికంగా ఉంటుంది.
- ఈ గింజలను తింటే గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు.
- పుచ్చకాయ గింజలను ఆహారంలో తీసుకుంటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.
- ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ‘టీ’లా తాగితే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయట.
- జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణలో పుచ్చకాయ గింజలు తోడ్పడతాయి.
పుచ్చకాయ గింజలను ఎలా తీసుకోవాలి?
పుచ్చకాయ నుంచి గింజలను సేకరించిన తర్వాత కొద్ది రోజులు ఎండబెట్టండి. ఆ తర్వాత వాటిని పొడిగా చేయండి.
2 లీటర్ల నీటిలో 2 టేబుల్ స్పూన్ల గింజల పొడి వేసి 15 నిమిషాలు మరిగించండి. ఈ పొడిని రెండు రోజులు తాగండి. మధ్యలో ఒక రోజు విరామం ఇవ్వాలి.
ఆ తర్వాత వరుసగా రెండు రోజులు తాగాలి. ఇలా చేయడం వల్ల పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ శరీరానికి దక్కుతాయి.