వాహన కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ కాలుష్యం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి.
అంతేకాదు ఈ కాలుష్యం వల్ల ఓజోన్ పొరలో రంద్రం ఏర్పడి సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో వేసవిలో భూతాపాన్ని తట్టుకోలేక మానవుడు విలవిల్లాడుతున్నాడు.
ఇటువంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఓ కొత్తరకం మొక్కను కనుగొన్నారు. అది గాలిలోని కాలుష్యాన్ని పీల్చేసి మంచి వాతావరణాన్ని ఇస్తుందంట. పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించగల శక్తి చెట్లకు ఉంది.
గాలిలో కార్భన్ డైయాక్సైడ్‌ను చెట్లు పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువును అందిస్తాయి. ఆరెంజ్ కోటోనేస్టర్ ( కోటోనేస్టర్ ఫ్రాంచెటి) అని పిలిచే ఓ కొత్త రకం మొక్క కూడా వాహనాల నుంచి వచ్చే పొగ ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని వెంటనే పీల్చేచుకుంటుంది.
కోటోనేస్టర్ జాతుల్లో ఒకటైన పసుపు వర్ణం కాయలతో కనిపించే ఈ మొక్క గాలిని ఎప్పటికప్పుడూ ఫీల్టర్ చేసేస్తుందంట.. న్యూయార్క్‌లోని రాయల్ హార్టికల్చరల్ సొసైటీ, యూకేలో యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.
నైరుతి చైనాలో లభ్యమయ్యే సాధారణమైన హెడ్జ్ ప్లాంట్ కారు నుండి వెలువడే కాలుష్య కారక వ్యర్థాలను పీల్చుకుని గాలిని శుభ్రంగా ఉంచడంలో సాయపడుతుందని కనుగొన్నారు.
ఈ మొక్కను ఫ్రాంచెట్ లేదా ఆరెంజ్ కోటోనేస్టర్ (కోటోనేస్టర్ ఫ్రాంచెటి )గా పిలుస్తారు. వాయు కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
పట్టణాల్లో నాటిన ఏ మొక్కలు కాలుష్య నివారణకు సాయపడతాయో తెలుసుకోవడమే లక్ష్యంగా పదేళ్లుగా మొక్కలపై ఈ పరిశోధన కొనసాగుతోంది. తాజా అధ్యయన ఫలితాలు పరిశోధకుల్లో మరిన్ని అంచనాలను పెంచింది.
ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే అనేక జాతుల చెట్ల పొదలను పరీక్షించడంలో ఈ బృందం తీవ్రంగా కృషి చేసింది. వాయు కాలుష్యం నుంచి రక్షించడంలో కొన్ని అత్యంత ప్రభావవంతమైన మొక్కలను కనిపెట్టే ప్రయత్నంలో ఆరెంజ్ కోటోనేస్టర్ మొక్కను కనుగొన్నారు.
హెడ్జెస్ ప్లాంట్ దట్టంగా పందిరిలా పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు కాలుష్య కారకాలను శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని అంటున్నారు. గాల్లో పేరుకుపోయిన కాలుష్య కారకాలను ఫీల్టర్ చేయడంలో 20 శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉందని గుర్తించారు.
కాలుష్యానికి ప్రభావితమయ్యే ప్రాంతాల్లో కారకాలను తగ్గించడానికి ఈ మొక్క సాయపడుతుంది. అడవిలో పెరిగే ఈ మొక్క సాధారణంగా 3 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది.
చిన్నపాటి ఓవల్ ఆకులతో మెరుస్తూ ఆకుపచ్చ రంగుతో కనిపిస్తుది. గులాబీ లేదా తెలుపు రేకులతో ఎరుపు-నారింజ బెర్రీలుగా పెరుగుతుంది.
వీటిని సహజంగా గుర్తుపట్టడం చాలా కష్టమంటున్నారు.