పుచ్చ‌కాయ గింజ‌ల‌ను ప‌డేస్తున్నారా?

285

వేల‌వి కాలం వ‌చ్చేసింది. పుచ్చ‌కాయ‌ల (వాట‌ర్‌మిలాన్‌) సీజ‌న్ కూడా ప్రారంభ‌మైంది. ఇప్పుడిప్పుడు మార్కెట్లో పుచ్చ‌కాయ‌లు క‌నిపిస్తున్నాయి.

వేస‌వి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి పుచ్చ‌కాయ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే చాలా మంది పుచ్చ‌కాయ‌లు తీనేట‌ప్పుడు గింజ‌లు తీసేసి ప‌డేస్తుంటారు.

ఆ గింజ‌ల‌ను ఏం చేస‌కుంటాం? ఖ‌ర్బుజ విత్త‌నాలుగా వాటిన తిన‌లేముగా? అంటారామే. కానీ అలా చేయ‌కండి. ఎందుకంటే పుచ్చ‌కాయ గింజ‌లు తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలున్నాయి.

ఆ ప్ర‌యోజ‌నాల గురించిన వివ‌రాల‌ను మీ ముందుకు తెస్తున్నాను…

  • వేస‌వి తాపం నుంచి మ‌న్న‌లి మ‌నం కాపాడుకోవ‌డానికి, ఛ‌రీరాన్ని చ‌ల్లబ‌రుచుకోవ‌డానికి ఈ పుచ్చ‌కాయ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
  • నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయల్లో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికం.
  • పుచ్చకాయలో అధిక క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారికి ఇది మంచి డైట్.
  • పుచ్చకాయలో ఉండే లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.
  • పుచ్చకాయ గింజల్లో విటమిన్-B అధికంగా ఉంటుంది.
  • ఈ గింజలను తింటే గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు.
  • పుచ్చకాయ గింజలను ఆహారంలో తీసుకుంటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.
  • ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ‘టీ’లా తాగితే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయట.
  • జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణలో పుచ్చకాయ గింజలు తోడ్పడతాయి.

పుచ్చకాయ గింజలను ఎలా తీసుకోవాలి?

పుచ్చకాయ నుంచి గింజలను సేకరించిన తర్వాత కొద్ది రోజులు ఎండబెట్టండి. ఆ తర్వాత వాటిని పొడిగా చేయండి.

2 లీటర్ల నీటిలో 2 టేబుల్ స్పూన్ల గింజల పొడి వేసి 15 నిమిషాలు మరిగించండి. ఈ పొడిని రెండు రోజులు తాగండి. మధ్యలో ఒక రోజు విరామం ఇవ్వాలి.

ఆ తర్వాత వరుసగా రెండు రోజులు తాగాలి. ఇలా చేయడం వల్ల పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ శరీరానికి దక్కుతాయి.