మొన్న వచ్చిన కరోనా వైరస్‌కు బెంబేలెత్తిపోయాం. అయితే మన పొట్టలో ఉండే వైరస్‌ల గురించి తెలిస్తే ఏమైపోతామో.
అవునండి! బయటి గాల్లోనే కాదు మన కడుపులో కనిపించని ఎన్నో వైరస్ జాతులు నివసిస్తుంటాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లకు మన పేగులే పుట్టినిళ్ళంట.
పొట్టలో లక్షా 40వేల వైరల్ జాతులు
దాదాపు లక్షా 40 వేల జాతుల వైరస్‌లు మన పొట్టలో నివసిస్తుంటాయంట. ఇన్ని లక్షల సూక్ష్మజీవాలు మన పొట్టలో ఉన్నప్పటికీ మనమెందుకు ఆరోగ్యంగా ఉన్నామనే అనుమానం శాస్త్రవేత్తలకు వచ్చింది.
దీనిపై అధ్యయనాలు కూడా మొదలు పెట్టారంట. నిజానికి పొట్టలో ఉన్న వైరస్‌కు హానికారకులు కాదు. ఇవి మనలను ఆరోగ్యంగా ఉంచడానికి రాత్రింబగళ్లు పనిచేస్తాయంట.
తెలియని ఎన్నో వైరస్ జాతులు మన శరీరంలో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మనిషి శరీరంలో ఇన్ని రకాల వైరస్‌లు ఉన్నాయని తెలిసి శాస్త్రజ్ఞులే ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకంటే కరోనా రాకముందు వీటి గురించి పట్టించుకున్న నాధుడే లేడు. కరోనా పుణ్యమా అని అన్ని రకాల సూక్ష్మజీవులపై శాస్త్రజ్ఞులు ఓ కన్నేశారు.
జీర్ణాశయంలో ఉండే ఈ వైరస్‌లన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఎలా జీవిస్తున్నాయి అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
ప్రేగుల్లో జీవించే వైరస్‌ల జీవన విధానాన్ని అర్థం చేసుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
వేలాది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్నజీవులకు మన శరీరమే ఆతిథ్యమిస్తోందని ఎప్పుడైనా అనుకున్నామా? మరి ఈ వైరస్‌లు పేగుల్లో ఎందుకు తిష్టవేశాయి?
అసలేం చేస్తుంటాయి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేస్తాయంట.. మనిషి శరీరంలోని మైక్రో ఆర్గానైజమ్స్ అన్ని కలిసి మైక్రోబయోమ్‌గా మారిపోతాయి. ఇవి ఎక్కువగా జీర్ణాశయంతర గోడల్లో నివసిస్తుంటాయి.
మైక్రోబయోటా అనే వైరస్‌లు కోట్లాది సంవత్సరాల నుంచి మనిషి ఆకారం, కణాల అభివృద్ధితో పాటు రోగనిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంటాయి.
హానికరమైన మైక్రోఆర్గానైజమ్స్, విషపూరిత సమ్మెళనాలను తొలగించడంలో రక్షణగా ఉంటాయి.
రోగనిరోధక వ్యవస్థ స్పందించేలా సూచనలు చేస్తుంటాయి. పోషకాహారంతో పాటు తిన్న ఆహారం త్వరగా అరిగిపోయేలా చేస్తాయి.
అయితే వీటి డీఎన్ఏ సీక్వెన్స్ మెథడ్‌కు సంబంధించి తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 28వేల మైక్రోబయోమ్ శాంపిల్స్ సేకరించారు.
ఆ విధంగా మన పేగుల్లో 1 లక్షా 40వేలకు పైగా వైరల్ జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు తమ విశ్లేషణలో తేల్చారు.