గూగుల్ పిక్సల్ 4 ఫోన్లు అక్టోబర్ 15న లాంచింగ్

370

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్.. పిక్సల్ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్లను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనుంది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 15న న్యూయార్క్‌లో నిర్వహించనున్న ఈవెంట్‌లో గూగుల్ తన పిక్సల్ 4 ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పిక్సల్ 4, పిక్సల్ 4 ఎక్స్‌ఎల్ ఫోన్లతోపాటు పిక్సల్‌బుక్ 2ను కూడా గూగుల్ తన ఈవెంట్‌లో విడుదల చేయనుంది.

పిక్సల్ 4 ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా, 6 జీబీ ర్యామ్, వెనుక భాగంలో 12.2, 12.2, 16 మెగాపిక్సల్ కెమెరాలు మూడు, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా, 64/128 జీబీ స్టోరేజ్, 5.7/6.23 ఇంచుల డిస్‌ప్లే, తదితర ఫీచర్లను అందివ్వనున్నట్లు తెలిసింది.