త్వరలో వాట్సాప్ మరో సూపర్ ఫీచర్

431
Facebook story

ఇటీవలి కాలంలో వరుసపెట్టి సరికొత్త ఫీచర్లను జోడిస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఇది వినియోగదారులకు శుభవార్తే. యూజర్లు తమ వాట్సాప్ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్ స్టోరీలుగా షేర్ చేసుకునే వెసులుబాటు రానుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే వాటిని ఇకపై ‘షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వాటిని ఫేస్‌బుక్ స్టోరీలుగా మార్చవచ్చు. స్టేటస్ అప్‌డేట్ తర్వాత స్టేటస్ బార్ కింద ‘షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ’ బటన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయగానే ఆ స్టేటస్ ఆటోమెటిక్‌గా ఫేస్‌బుక్ స్టోరీలోనూ దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉంది.

‘‘స్టేటస్‌ను అప్‌డేట్‌ చేయగానే అందులోని సమాచారం ఫోన్లలోని ఇతర యాప్స్‌తో పంచుకుంటుంది. కాబట్టి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండదు. అయితే, ఇక్కడ స్టేటస్ అప్‌డేట్‌ను షేర్ చేయగానే యూజర్ అకౌంట్‌కు చెందిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో కానీ, ఇతర యాప్స్‌తో కానీ వాట్సాప్ పంచుకోదు. కాబట్టి ఇది సురక్షితం’’ అని వాట్సాప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.