నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (జూన్ 09)

353
today events in hyderabad
today programs in Hyderabad

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సు
కార్యక్రమం: ‘రైతు నేస్తం ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, శిక్షణ
స్థలం: ఫ్ట్యాప్సీ ఆడిటోరియం, రెడ్‌హిల్స్‌
సమయం: ఉ. 10 – 4

‘సాహితీ కిరణం’ వార్షికోత్సవం
కార్యక్రమం: ‘సాహితీ కిరణం’ వార్షికోత్సవాల సందర్భంగా… రచయిత, విమర్శకుడు డాక్టర్‌ పులివర్తి కృష్ణమూర్తికి డాక్టర్‌ పింగళి జగన్నాథరావు స్మారక సాహిత్య పురస్కార ప్రదానం, ఆచార్య కొలకలూరి ఇనాక్‌ రచించిన ‘ముని వాహనుడు’ నాటకంపై యం.బాలనాగయ్య స్మారక వ్యాస రచన పోటీ విజేతలకు బహుమతి ప్రదానం, జీవీఆర్‌ పురస్కారాల ప్రదానం
స్థలం: కళా సుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6



భక్తి గీతాలు
కార్యక్రమం: నవలా రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు వర్ధంతి సందర్భంగా త్యాగరాయ గానసభ, సుమధుర ఆర్ట్స్‌ నిర్వహణలో… అను సిస్టర్స్‌చే
‘దేశ భక్తిగీతాలు’
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6

‘బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ…’పై సదస్సు
కార్యక్రమం: ఫ్ట్యాప్సీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో… ‘బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, ఆపర్చ్యునిటీస్‌ అండ్‌ చాలెంజెస్‌’ అంశంపై సదస్సు
స్థలం: ఫెడరేషన్‌ హౌస్‌, రెడ్‌హిల్స్‌
సమయం: ఉ. 10

మరాఠి కల్చరల్‌ ఫెస్టివల్‌
కార్యక్రమం: మిత్రాంగన్‌ మహారాష్ట్రియన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ‘మరాఠి కల్చరల్‌ & ఫుడ్‌ ఫెస్టివల్‌’
స్థలం: అంఫి థియేటర్‌, శిల్పారామం
సమయం: సా. 5 (రేపటి వరకు)

లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌
కార్యక్రమం: రోషికా మాధురి ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో… లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌
స్థలం: కళింగ ఫంక్షన్‌ హాల్‌, రోడ్‌ నెం.12, బంజారాహిల్స్‌
సమయం: ఉ. 9 – 9 (రేపటి వరకు)



‘ఆనందకేళి’
కార్యక్రమం: నృత్య కిన్నెర ఆధ్వర్యంలో ‘ఆనందకేళి’ డ్యాన్స్‌ ఆఫ్‌ ది డివైన్‌
అతిథులు: దగ్గుబాటి పురందేశ్వరి, తదితరులు
స్థలం: రవీంద్రభారతి
సమయం: సా. 6

‘అర్బన్‌ నక్సల్స్‌’
కార్యక్రమం: వివేక్‌ అగ్నిహోత్రి రచించిన ‘అర్బన్‌ నక్సల్స్‌’ ది మేకింగ్‌ ఆఫ్‌ బుద్ధా ఇన్‌ ఎ ట్రాఫిక్‌ జాం… బుక్‌ రీడింగ్‌ సెషన్‌
స్థలం: సీసీఆర్‌టీ అంఫి థియేటర్‌/ట్రైనింగ్‌ హాల్‌, మాదాపూర్‌
సమయం: సా. 5.30