అమ్మ‌మ్మ గా ప్ర‌మోష‌న్ పొందిన అల‌నాటి సినీ నటి

1077
radhika-daughter-rayane-blessed-with-baby-boy

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక కుమార్తె రెయాన వివాహం క్రికెటర్ అభిమన్యు మిథున్‌తో 2016 ఆగ‌స్ట్‌లో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం రాత్రి రెయాన పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఈ క్ర‌మంలో రాధికా శ‌ర‌త్ కుమార్ అమ్మ‌మ్మ ప్ర‌మోష‌న్ అందుకుంది. దీంతో త‌న ఆనందాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా నెటిజ‌న్స్‌తో పంచుకుంది. ‘‘సో సో హ్యాపీ.. గాడ్ బ్లెస్..’’ అంటూ ‘ఇట్స్ ఏ బాయ్’ అనే చిత్రాన్ని పోస్ట్ చేశారు.



రాధిక రెండో భర్త రిచర్డ్ హార్డిల కుమార్తె రెయాన . 1992లో ఆయనకు విడాకులిచ్చిన రాధిక.. 2001లో నటుడు శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రాధిక సినిమాల్లో నటిస్తూనే డైలీ సీరియళ్ల నిర్మాతగా బిజీగా ఉన్నారు.

 

Also read :

ఆపుకోలేక ఆ విషయం బయట పెట్టేసిన అనుపమ