సుమ ముక్కు లో నుండి పొగలు

936
anchor-suma-ice-cream-video

తెలుగు యాంకర్‌ సుమ తన మాటకారితనంతో, ఆడియో ఫంక్ష‌న్స్ , స్టేజ్ షోస్ , ఎంట‌ర్‌టైన్‌మెంట్ షోస్‌, గేమ్ షోస్ ఇలా ఏదైన స‌రే తనదైన శైలిలో విసిరే పంచ్‌లతో యాంకరింగ్‌ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉండే సుమ సంద‌ర్భాన్ని బ‌ట్టి కొన్ని పోస్ట్‌లు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కి ప‌సందైన విందు అందిస్తుంది. ఆ మ‌ధ్య ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్ లాల్ న‌టించిన‌ వెలిప‌డింతె పుస్త‌కం అనే సినిమాలోని సాంగ్ జిమిక్కి క‌మ్మ‌ల్ కు స్టెప్పులేసింది. మాట్లాడ‌డ‌మే కాదు డ్యాన్సింగ్ కూడా అద‌ర‌గొడ‌తాన‌ని నిరూపించింది.



 

తాజాగా ఆమె ఓ చోట ఐస్‌క్రీమ్‌ తింటూ వీడియో తీసుకుంది. అది మామూలు ఐస్‌క్రీమ్‌ కాదు. ఎంతో చల్లగా ఉండే ఆ ఐస్‌క్రీమ్‌ను తింటే నోట్లోంచి, ముక్కులోంచి పొగలు కక్కాల్సిందే. దాన్ని సుమ తింటూ తనదైన శైలిలో హావభావాలు ఒలకబోస్తూ, ఐస్‌క్రీమ్‌ రుచిని ఆస్వాదించింది. దాన్ని తింటూ నవ్వుతూ అందరినీ నవ్విస్తోంది. ఓ డ్రాగన్‌ వదిలే శ్వాసలా ఇలా పొగ వచ్చేస్తోందని సుమ పేర్కొంది. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది.