విద్యార్థిని పట్ల ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు

683
Principal obnoxious behavior towards

జిల్లాలోని దమ్మపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థిని ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌కు దేహశుద్ధి చేశాడు.




 

బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మపేట మండలం రాచూరిపల్లికి చెందిన ఓ విద్యార్థిని స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ప్రిన్సిపల్ స్లీవర్ కొన్ని రోజులుగా విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేని విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపల్‌కు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు అక్కడికి చేరకుని తల్లిదండ్రులకు సర్దిచెప్పారు.

ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సదరు ప్రిన్సిపల్ విధుల్లో ఉండటానికి వీళ్లేదని, అతన్ని వెంటనే తొలగించాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.