టమోటా లేనిదే ఒక మంచి వంట వండటం అసాధ్యం. ఒకప్పుడు ఇంటికి అందాన్నిచ్చే క్రోటన్ మొక్కగా టమాటాను పెంచుకునే వాళ్లు ఇప్పడది కూరగాయగా మారింది.
ఆమెరికా నుంచి ఇంగ్లండ్‌కు అక్కడి నుంచి 1850లో భారత్‌కు వచ్చిందీ టమోటా. అతి తక్కువ సమయంలో కూరగాయలలో ప్రధమ స్థానాన్ని సంపాదించింది.
ఈ రోజుల్లో టమాటా కూరలేని ఇల్లు కానీ టమాటా అమ్మని కూరగాయల దుకాణం కానీ ఉండదని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. టమాటా తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ టమాటాలో విటమిన్ సి, ఫోలెట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ టమాటాను ప్రతి రోజు మనం తినే ఆహారం తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో.
మన శరీరంలోని ఎముకలు గట్టి పడటానికి, వాటిని బలంగా ఉంచడానికి టమాటాలో ఉండే విటమిన్ కె, కాల్షియం ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్-ఎ దృష్టిని మెరుగుపరుస్తుంది.
మరో ముఖ్యమైన అంశమేంటంటే… రే చీకటి నివారణకు టమామాలు బాగా ఉపయోగపడతాయి. టమాటాలు సహజంగానే క్యాన్సర్ ఫైటర్స్. ఇవి తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాలు తక్కువ.
బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను సరి సమానంగా ఉంచుతాయి. నొప్పులను కూడా ఈ టమాటా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి.
టమాటా తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అందంగా కూడా ఉంటామని పరిశోధనలు చెబుతున్నాయి. టమాటాలో ఉండే విటమిన్-ఎ జట్టు రాలిపోకుండా చూడటమే కాకుండా జట్టును కాంతివంతంగా చే్స్తుంది.
దీనిలో ఉండే బీటా కెరోటిన్ చర్మాన్ని రక్షిస్తుంది. టమాటాను రెండు ముక్కలుగా కోసి ఆ ముక్కలను పంచదారలో అద్ది దానిని చర్మం మీద రాసుకుంటే చర్మంపై ముడతలు ఉండవు.